ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

సీఎం పై రోజా షాకింగ్ కామెంట్స్

చాలా రోజుల తరువాత మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష పార్టీ వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే రోజా అధికార పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆమె వివాదాస్పద కామెంట్స్ చేయడంతో మీడియాల్లో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో బడ్జెట్ లేకున్నా కూడా సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

అంతే కాకుండా అయన ఒక దద్దమ్మ అని కామెంట్ చేశారు. రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్నా కూడా సీఎం పట్టించుకోకుండా జల్సాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. అదే విధంగా రోజా జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. వైసిపి అధ్యక్షుడు జగన్ పాదయాత్ర తప్పకుండా విజయవంతం అవుతుందని చెబుతూ.. పాదయాత్ర వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్ మార్క్ అని తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యతతో జగన్ పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారని కూడా రోజా వివరించారు. అయితే ఇప్పటికే యువభేరి కూడా సక్సెస్ అయ్యిందని ప్రతి పక్ష నేతలకు పిచ్చెక్కిందని కౌంటర్ చేశారు.

Comments