ప్రచురణ తేదీ : Dec 4, 2017 6:25 PM IST

రిలీజ్ డేట్స్ కదిలిపోయేలా టాలీవుడ్ లో అరవోళ్లు ప్రకంపనలు..!

టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల గోల ఎప్పుడూ ఉండేదే. ఇక్కడి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అరవ సినిమాలు ఖాళీ లేక పోయినా దూసుకొచ్చేస్తున్నాయి. ఇది ఎప్పుడూ ఉండే గొడవే. కానీ ఈ సరి మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు తమిళ స్టార్ హీరోలు అడ్డుగా మారడంతో రీసౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. బని నటిస్తున్న నాపేరు సూర్య, మహేష్ భరత్ అనే నేను చిత్రాలు ఏప్రిల్ 27 గా విడుదుల తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. ఒకేరోజు రెండు భారీ చిత్రాలు విడుదల కాబోతుండడంతో టాలీవుడ్ లో హీట్ పెరింది. కానీ విడుదుల సమయానికి నిర్మాతలు ఓ అవగాహనకు వచ్చి విడుదుల తేదీల్లో మార్పులు చేసుకుంటారనే ప్రచారం జరిగింది. ఇక్కడేరజినీకాంత్ 2.0 చిత్రం భారీ షాక్ ఇచ్చింది.

ఈ సినిమాని కూడా ఏప్రిల్ 27 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తేల్చేశారు. ఇక్కడి నుంచే అసలు ప్రకంపనలు మొదలయ్యాయి. అంత భారీ చిత్రాన్ని ముందుగా విడుదుల తేదీ ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ చిత్రాలకు పోటీగా విడుదల చేయడం ఏంటని నాపేరు సూర్య చిత్ర నిర్మాత బన్నీ వాసు సూటిగా అడిగేశారు. మహేష్ భరత్ అనే నేను చిత్ర నిర్మాతలనుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ ఎప్పుడూ పరభాషా చిత్రాలని గౌరవిస్తుంది. కానీ తమని ఇబ్బందికి గురిచేసేలా విడుదల తేదీ ప్రకటించడం సరైన నిర్ణయం కాదు. దీనికి లైకా సంస్థ తగిన వివరణ ఇవ్వాలని కోరారు.

అదే సమయంలో సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాలకు కూడా అరవ పోటీ తప్పడం లేదు. సూర్య నటిస్తున్న గ్యాంగ్ చిత్రం జనవరి 12 న విడుదల కాబోతోంది. కాగా సంక్రాంతికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాలయ్య జై సింహా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇరుకుగా మారిన సంక్రాంతి రేసులోకి సూర్య రావడం ఏంటని జై సింహా నిర్మాత సి కళ్యాణ్ గుర్రుగా ఉన్నారట. ఆయన కూడాగ్యాంగ్ నిర్మాతలతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా రజినీ 2.0 చిత్రం విడుదల తేదీని మార్చకుంటే మహేష్, బన్నీ ల చిత్రాలు వాయిదా పడక తప్పని పరిస్థితి నెలకొని ఉంది.

Comments