ప్రచురణ తేదీ : Tue, Sep 12th, 2017

రియ‌ల్‌స్టార్ కీ.శే.శ్రీ‌హ‌రి వైఫ్‌ మేన‌కోడ‌లు అదృశ్యం

దివంగత నటుడు, రియ‌ల్‌స్టార్‌ శ్రీహరి సతీమణి శాంతి మేనకోడలు అబ్రిన్ (17)అదృశ్యమ‌వ్వ‌డం చెన్న‌య్ టీనగ‌ర్‌లో సంచ‌ల‌న‌మైంది. శాంతి సోద‌రుడు, స‌హాయ ద‌ర్శ‌కుడు అరుణ్ మొళి వ‌ర్మ‌న్ కుమార్తె అబ్రిన్… గ‌త సెప్టెంబ‌ర్ 6న స్కూల్‌కి వెళ్లి తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఊరూ వాడా గాలించారు. ఎంత‌కూ లాభం లేక‌పోవ‌డంతో చివ‌రికి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

టీన‌గ‌ర్ పాండిబజార్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి ప్ర‌స్తుతం పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నారు. అబ్రిన్ స్కూల్లో 56 సీసీ కెమెరాలు ఉన్నా అవేవీ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో విచార‌ణ క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంద‌ని పోలీసులు చెబుతున్నారు. శాంతి, అబ్రిన్ త‌ల్లి లలిత కుమారి విన్నపం మేరకు న‌డిగ‌ర‌ సంఘం సామాజిక మాధ్య‌మాల ద్వారా సాయం అందిస్తోంది.

Comments