ప్రచురణ తేదీ : Sat, Sep 19th, 2015

పెట్రోల్ ఇక్కడ దొరుకుతుంది బాబు..!

trafic-police

చూశారుగా ఈ ట్రాఫిక్ పోలీస్ ఎం చేస్తున్నాడో.ఈయన మామూలు పోలీస్ కాదండోయ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హొదా ఉన్న ట్రాఫిక్ పోలీస్.ఉండేది హైదరాబాద్ ఈయన ప్రతిరోజు డ్యూటీకి వచ్చేటప్పుడు తల మీద క్యాప్ తో పాటు బ్యాగ్ లో 6 బాటిళ్ళ పెట్రోల్ కూడా తెచ్చుకుంటాడట.మీరనుకుంటున్నట్టు అమ్మడానికి కాదండోయ్.ఎవరైనా రోడ్డు మీద పెట్రోల్ అయిపోయి ఇబ్బంది పడుతూ కనిపిస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి పెట్రోల్ ఇస్తాడు,డబ్బులు సార్ అంటే పరవాలేదు మీరు కూడా మరొకరికి సాయం చెయ్యండి చాలు అంటాడు.ఎందుకు సార్ అంటే తోటి మనిషికి తోచిన సాయం అంటాడు.సాయం చెయ్యడంలో ఆనందం ఉందంటాడు.పోలిసులంటే కారణం ఉన్నా లేకున్నా డబ్బులు వసూలు చేసే వారని పేరున్న ఈ రోజుల్లో ఇలాంటి వారుండటం నిజంగా విశేషమే మరి.

Comments