ప్రచురణ తేదీ : Dec 2, 2017 1:50 AM IST

మరోసారి పోలీస్ అవతారంలో రవితేజ.. ఇక కేకలే ?

మాస్ మహారాజ్ రవితేజ .. తాజాగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో తన వరుస పరాజయాలకు కామా పెట్టాడు ..ఈ సారి ఎలాగైనా సరే సంచలన విజయం అందుకోవాలని లక్ష్యంతో ఉన్నాడు .. అందుకే ఈసారి రెట్టించిన ఉత్సహంతో తన నెక్స్ట్ సినిమాతో సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే అయన నటిస్తున్న తాజా చిత్రం టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడట. ఇక రవితేజ పోలీస్ అయితే .. ఆపోజిట్ గ్యాంగ్ కు బ్యాండే !! ఇదివరకే విక్రమార్కుడులా పోలీస్ గెటప్ లో అదరగొట్టిన రవితేజ మరోసారి ఈ సినిమాలో కూడా అదరగొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జనవరిలో విడుదల చేయాలనీ భావిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Comments