ప్రచురణ తేదీ : Dec 3, 2017 10:53 PM IST

నానికోసం రంగంలోకి రవితేజ – కాజల్ ?

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని తాజాగా నిర్మాతగా కూడా మారాడు. వాల్ పోస్టర్ పేరుతొ ఓ బ్యానర్ ని మొదలు పెట్టి .. ఆ బ్యానర్ పై తోలి ప్రయత్నంగా ఆ! పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ కావొచ్చినా ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాను మార్కెట్ చేసుకునేందుకు నాని అప్పుడే గట్టి ప్లాన్స్ వేసాడు .. ఎందుకంటే క్రేజ్ ఉన్న స్టార్స్ ను ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ కు మంచి క్రేజ్ వస్తుందని భావించిన నాని క్రేజీ ఉన్న స్టార్స్ ని రంగంలోకి దింపాడు .. ఇక నాని చేస్తున్న ప్రయత్నం నచ్చడంతో నానికి సపోర్ట్ గా రవితేజ, గ్లామర్ భామ కాజల్ , నిత్యా మీనన్ లో సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ముగ్గురు ఈ సినిమాలో గెస్ట్ పాత్రల్లో కనిపిస్తారట. పైగా నిత్యా మీనన్ ఉన్న ఓ పోస్టర్ ను కూడా లేటెస్ట్ గా విడుదల చేయడంతో ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ పెరిగింది. వారు ఇందులో నటించడమే కాకుండా సహా నిర్మాతలుగా కూడా సపోర్ట్ ఇస్తున్నారట ! మరి ఈ కథ అంత బాగా నచ్చి నాని నిర్మాతగా మారాడంటే .. కథలో ఎదో విషయం ఉన్నట్టేగా !! చూద్దామ్!!

Comments