ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

నిజమా …చరణ్ ముందుగానే వస్తాడట ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ ప్రసుతం హైద్రాబాద్ లో వేసిన భారీ విలేజ్ సెట్ లో జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే .. అయితే అనుకున్న సమయానికి ముందే విడుదల అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తీ కావొచ్చిన నేపథ్యంలో త్వరగానే విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ప్రకటించిన డేట్ కంటే ముందు చేస్తారన్న వార్త తెలియడంతో మెగా ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది.

Comments