ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

నేనే రాజు… జానకి… లై! మూడు సినిమాల ఆటలో ఓవర్సీస్ రాజు అతడే!

శుక్రవారం టాలీవుడ్ నుంచి మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్ లో వచ్చి మూడు ఆకట్టుకునే టాక్ తో ప్రస్తుతం రన్ అవుతున్నాయి. ఓవర్సీస్ లో మార్కెట్ లో కూడా మూడు సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. శుక్రవారం ఒక్క రోజులోనే ఓవర్సీస్ మార్కెట్ లో నేనే రాజు నేనే మంత్రి మూవీ టాప్ సుమారు కోటి 68 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. దాని తర్వాత స్థానంలో లై 65 లక్షలు కలెక్ట్ చేసింది, ఇక జయ జానకి నాయక అయితే కేవలం 18 లక్షలు మాత్రమె కలెక్ట్ చేసింది. రానాకి బాహుబలి క్రేజ్ వలన ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తెచ్చుకోగా. మిగిలిన హీరోలకి, దర్శకులకి చెప్పుకోదగ్గ మార్కెట్ లేకపోవడం ఓవర్సీస్ లో ఈ రెండు సినిమాలు నేనేరాజుని ఎ మాత్రం అందుకోలేకపోయాయి. అయితే దీనికి విరుద్ధంగా ఇక్కడ మాత్రం జయ జానకి నాయకా మంచి హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంటే. సెకండ్ ప్లేస్ లో నేనే రాజు నేనే మంత్రి ఉంది. ఇక లై సినిమా అయితే కలెక్షన్స్ భాగా పూర్ గా ఉన్నాయి. అయితే లాంగ్ రన్ లై మూవీ నిలబడే అవకాశాలు అయితే పెద్దగా కనిపించడం లేదు. కాని బోయపాటి సినిమా, అటు తేజ సినిమా కలెక్షన్స్ లో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

Comments