ప్రచురణ తేదీ : Nov 9, 2017 10:58 AM IST

అర్జున్ రెడ్డి సూపర్ ఫ్లాప్ సినిమా అవ్వడం పక్కా : రామ్ గోపాల్ వర్మ

విడుదలకు ముందే ఎంతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిందే. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్స్ లో అర్జున్ రెడ్డి కూడా రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది. అయితే సినిమా హిట్ అయిన తర్వాత దర్శకుడు సందీప్ వంగ ఎటువంటి సినిమా తీస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. మంచి ప్రయోగాత్మకమైన కథతో రాబోతున్నానని ఇంతకుముందే దర్శకుడు చెప్పాడు.

అయితే రీసెంట్ గా సందీప్ తన నెక్స్ట్ మూవీ కథను విలక్షణ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ కి చెప్పాడట. ఈ విషయాన్ని వర్మ తన ఫెస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు. అంతే కాకుండా ఆ సందీప్ తో దిగిన ఒక ఫొటోని కూడా పోస్ట్ చేశాడు. అతని నెక్స్ట్ సినిమా కథను తనకు వినిపించాడని. అయితే కథను వినగానే నేను చాలా అసూయా చెందాను అని వివరిస్తూ..ఆ సినిమా అర్జున్ రెడ్డి కంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పాడు. అదే విధంగా ఆ సినిమా ముందు అర్జున్ రెడ్డి ఓ పెద్ద సూపర్ ఫ్లాప్ సినిమా అయిపోతుందని తనదైన శైలిలో వివరించాడు.

Comments