ప్రచురణ తేదీ : Mon, Mar 26th, 2018

మల్టీ స్టారర్ పై ఖంగుతినిపిచ్చిన చెర్రి

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ సినిమా అని ఎప్పుడైతే సినిమాకు సంబందించిన చిన్న టీజర్ రిలీజ్ చేసారో అప్పటినుంచి ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు మొదలైపోయాయి. రాజమౌళి.. చెర్రీ-తారక్‌లతో ఫోటోను అప్‌ లోడ్‌ చేసినప్పటి నుంచే వీరి చిత్రం స్టోరీ గురించి మీడియాలో కథా కథనాల గురించి రకరకాల గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంటే చెర్రీ ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చాడు. అసలు ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ ఏదీ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు.

ప్రస్తుతం తాజా చిత్రం రంగస్థలం చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న రామ్‌ చరణ్‌ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ… ‘ఈ చిత్రానికి సంబంధించి కథ సిద్ధమైందన్న దానిపై నాక్కూడా సరైన స్పష్టత లేదని అన్నాడు. కేవలం రాజమౌళిని పైన ఉన్న నమ్మకంతో ఆ చిత్రానికి సంతకం చేశాను. అంతేకాదు తారక్‌తో కాంబినేషన్‌ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. అయితే కథను త్వరలోనే వినిపిస్తానని రాజమౌళి నాతో చెప్పారు’ అని చరణ్ వెల్లడించాడు.

మరోవైపు రాజమౌళి మాత్రం కథ నేపథ్యాన్ని ఓకే చేసుకున్నాడని.. స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడన్న వార్త ఒకటి చిత్రపరిశ్రమలో వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ఈ మల్టీస్టారర్‌ విషయంలో ఎలాంటి తొందరపాటు పనికి రాదని రాజమౌళి భావిస్తున్నాడనిపిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో లాంఛ్‌ అయ్యే అవకాశం ఉంది. మిగతా తారాగణం.. టెక్నీషియన్ల పేర్లను ఆ సమయంలోనే ప్రకటించనున్నారు. ఇక వేరిద్దరికి సంబంధించి బాహుబలి రాజమౌళి ఇప్పుడు ఎలాంటి కథతో మన ముందుకు వస్తాడో అన్నది వేచి చూడాల్సిందే.

Comments