ప్రచురణ తేదీ : Mon, Apr 30th, 2018

అవినీతిలేని ఏకైక ఇండస్ట్రీ సినిమా పరిశ్రమే అంటున్న చరణ్ ?

ప్రపంచంలో ఏదైనా అవినీతి లేని పరిశ్రమ ఉందంటే అది ఒక్క సినిమా పరిశ్రమే అని అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజగా అయన అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ తాజాగా పరిశ్రమలో జరిగిన ఆరోపణల గురించి ప్రస్తావించారు. సినిమాల కోసం తాము ఎంతగానో కష్టపడతామని, దెబ్బలుకూడా తగులుతాయని అయినా మీకు ఆనందం పంచడమే మాకు తెలుసనీ అన్నారు. అల్లు అరవింద్ ఏమి మాట్లాడిన దాన్ని వివాదంగా మారుస్తారని, ఈ విషయం పై అయన ఎంతగా బాధపడతారో తాను అర్థం చేసుకుంటానని అన్నారు. ఉదయం 5 గంటలను లేచి .. జిమ్ చేసి, మేకప్ వేసుకుని ఉదయం నుండి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తామని, ఎండా, వానలు కూడా లెక్కచేయమని ఆయన అన్నారు. బన్నీకి రిస్కీ షాట్స్ కారణంగా ఎన్ని గాయాలు అయ్యాయో తనకు తెలుసనీ అన్నారు. మహేష్, ప్రభాస్, తారక్ లకు కూడా ఎన్నో గాయాలు తగిలాయని చెప్పారు. ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతున్నామని, ఈ విషయం మీడియా కు తెలుసు అయినా వారు ఎదో రాస్తుంటారని చురకలు అంటించారు.

Comments