ప్రచురణ తేదీ : Mon, Dec 4th, 2017

వెంకన్న సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయన సతీమణి ఉపాసన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం రామ్ చరణ్ దంపతులకు ఆలయ అధికారులు సదర స్వగతం పలికారు. సోమవారం ఉదయం వి ఐ పి ప్రారంభ దర్శనంలో వీరిద్దరూ పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు నిర్మాత ఎన్వీ ప్రసాద్, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ కూడా వచ్చాడు. దర్శనం అనంతరం రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. .. జూనియర్ మెగాస్టార్ అంటూ అరుస్తూ చరణ్ తో మాట్లాడడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలంలో నటిస్తున్న విషయం తెలిసిందే .. దాంతో పాటు చిరంజీవి తో సైరా నరసింహ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు.

Comments