ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

`రాజుగారి గ‌ది-2` @ 25 కోట్లు


కింగ్ నాగార్జున న‌టించిన `రాజుగారి గది-2` ఈ శుక్ర‌వారం ఘ‌నంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున న‌టించిన మొట్ట‌మొద‌టి హార‌ర్ సినిమా ఇది. ఆయ‌నకు దెయ్యాలంటే గిట్ట‌క‌పోయినా, తొలిసారి బాక్సాఫీస్ హిట్‌ కోసం ఈ చిత్రంలో న‌టించార‌ని చెప్పొచ్చు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సీక్వెల్ మూవీ ఇది. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో సాగింది? తెలియ‌లంటే ఇది చ‌ద‌వాల్సందే. `రాజుగారి గ‌ది 2` నాగార్జున కెరీర్‌లోనే రికార్డ్ స్థాయి బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. రిలీజ్‌కి ముందే నిర్మాత‌ల‌కు 25 కోట్లు టేబుల్ మీదికి వ‌చ్చాయిట‌. నైజాం- 7.5 కోట్లు, ఆంధ్రా -తెలంగాణ క‌లిపి 20 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింద‌ని తెలుస్తోంది. కింగ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయ‌నా` బిజినెస్ కంటే బెట‌ర్ బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. సోగ్గాడేకి 19 కోట్ల మేర బిజినెస్ సాగింది. అంత‌కుమించి రాజుగారి గ‌ది 2 బిజినెస్ చేయ‌డం విశేషం. ఇక నాగార్జున కెరీర్‌లోనే ది బెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమా `ఓం న‌మో వెంక‌టేశాయ‌`. దాదాపు 34 కోట్ల మేర బిజినెస్ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో పంపిణీదారుల‌కు తీవ్ర న‌ష్టాలొచ్చాయి.

Comments