ప్రచురణ తేదీ : Jan 8, 2018 7:20 PM IST

రజినీ మెచ్చిన తలైవా అతడే..!

తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . తలైవా ని ఇష్టపడని వారుండరు అంటే అతిసాయయోక్తి కాదేమో , అటువంటి తలైవా అమితంగా మెచ్చే క్రికెటర్ ఒకరున్నారు . ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరని మీడియా అడిగిన ప్రశ్నకి రజిని , ఇండియా కి రెండు సార్లు ప్రపంచ కప్ అందించిన ధోని అని చెప్పారు. ధోని ఆటశైలి తనకు బాగా నచ్చుతుంది అని రజిని అన్నారు.

ప్రస్తుతం ఎవరిని కదిలించి మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని అడిగితే , ఠక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ . ఇతరులు ఎంత మంది తనకి పోటీ వచ్చినా తన ప్రాభవం తగ్గదని ధోని ఈ విషయం ద్వారా నిరూపితమైంది . ఈ ఏడాది జరగనున్న ఐపీల్ లో చెన్నై తమ జట్టులో జడేజా, రైనా తోపాటు ధోని ని కూడా అట్టిపెట్టుకున్న విషయం తేలిందే. అంతే కాదండోయి ఈ మధ్య తన పై తీసిన ఒక యాడ్ కి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు శంకర్ ని , ధోని ఎక్కువగా రజిని కి సంబందించిన విషయాలనే అడిగి తెలుసుకున్నారని శంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Comments