ప్రచురణ తేదీ : Nov 12, 2017 4:41 PM IST

నాకు అఫైర్లు ఉన్నాయి..కానీ ఆమెతో మాత్రం కాదు – రాజశేఖర్ !

90 లలో మంచి విజయాల్ని నమోదు చేసుకున్న తరువాత హీరో రాజశేఖర్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆయనకు సరైన విజయాలు దక్కక నిరాశలోకి వెళ్లారు. కాగా ఇటీవల విడుదలైన గరుడ వేగ చిత్రంతో చాలా కాలం తరువాత విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం తరువాత తాను మళ్లీ పుంజుకున్నానని రాజశేఖర్ అంటున్నారు. తాజాగా రాజశేఖర్ తన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

ఆ మద్యన వ్యభిచార రాకెట్ లో బయట పడ్డ తారాచౌదరి వ్యవహారం తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆమెతో మీకు సంబంధాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు రాజశేఖర్ సమాధానం ఇచ్చారు. తాను రాముడి లాంటి వాడిని కాదని రాజశేఖర్ తెలిపాడు. తనకు వివాహం ముందు, జీవితతో వివాహం అయ్యాక కూడా కొందరితో సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. కానీ తారాచౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఓసారి ఆమె నాతో ఫోటో దిగిందని, మరో మారు ఓ సందర్భంగా తనని కలుసుకుందని అందుకే ఈ పుకార్లు పుట్టుకొచ్చాయని ఈ యాంగ్రీ మాన్ తెలపడం విశేషం.

Comments