ప్రచురణ తేదీ : Sep 25, 2017 5:32 PM IST

మహాభారతం తీయడం నా వల్ల కాదు : రాజమౌళి

బాహుబలి తర్వాత రాజమౌళి ఎటువంటి కథను తెరకెక్కిస్తాడా అని ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. బాలీవుడ్ మీడియా కూడా టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్టు ఏ తరహాలో ఉంటుందా అని పరభాష ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే జక్కన్న మాత్రం ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని గట్టిగా చెప్పేశాడు. అంతే కాకుండా రాజమౌళి మహాభారతం తీస్తే చూడాలని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే వారికి జక్కన్న ఊహించని స్థాయిలో షాక్ ని ఇచ్చాడు. ఎందుకంటే మొన్నటి వరకు మహాభారత తన డ్రీమ్ ప్రాజెక్టు అన్న జక్కన్న. ఇప్పుడు తీస్తానో తియ్యనో తనకే తెలియదని చెప్పి సందిగ్ధంలో పడేశాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకదీరుడు. మహాభారతం గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పను. అంతే గాని దాన్ని తీస్తానని చెప్పలేదని చెప్పాడు. అయితే గత ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తప్పకుండా మహాభారతం తీయనున్నాడని చెప్పాడు. కానీ రాజమౌళి మాత్రం ఆ క్లారిటీ ఇవ్వకపోవడం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments