ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

నీనుంచి నేర్చుకోవాల్సింది ఉంది- రాజ‌మౌళి

rajamouli1
బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి నేడు థియేట‌ర్ల‌లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాల‌య్య ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ట్రీట్‌నిచ్చింద‌న‌డంలో సందేహం లేదు. తెలుగువారి చ‌రిత్ర‌ను వెలుగులోకి తెచ్చిన గొప్ప సినిమాగా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఇంత పెద్ద భారీ కాన్వాసుతో వార్ సీన్స్ ఉన్న సినిమాని కేవ‌లం 79 రోజుల్లో తెర‌కెక్కించిన క్రిష్‌ని మ‌రోసారి రాజ‌మౌళి పొగిడేశారు. హ్యాట్సాఫ్ చెప్పారు. నీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ కీర్తించారు.

అలాగే పైనున్న నంద‌మూరి తార‌క‌రామారావు గ‌ర్వించేలా న‌టించావ‌య్యా బాల‌య్యా అంటూ న‌ట‌సింహాని ఆశాకానికెత్తేశారు జ‌క్క‌న్న‌. టెక్నిక‌ల్‌గా అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంసించారు. 12 కోట్ల మంది తెలుగువారి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయ‌ని రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో ఈ సందేశాన్ని అందించారు.

Comments