ఐపీఎల్ బెట్టింగ్‌లో శిల్పా భర్త గిల్టీ ఫీలింగ్!
2013లో ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ కో-వోనర్‌గా అతడు ఓ మ్యాచ్‌లో బెట్టింగులకు పాల్పడ్డారన్న నిందారోపణలు ఎదుర్కొన్నారు. అటుపై దిల్లీ పోలీసులు ఈ వ్వవహారంపై తీవ్ర విచారణ సాగించారు. కుంద్రా తప్పు ఉందని పోలీసులు ఆరోపించారు. చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బెట్టింగు వ్యవహారంలో లైఫ్ బ్యాన్‌కి గురయ్యాయి. అయితే సుప్రీంకోర్ట్‌లో బ్యాన్‌ని రివ్యూ చేయమని పిల్ దాఖలు చేసిన కుంద్రా అక్కడ తన వాదన సరిగా వినిపించడంలో విఫలమయ్యానని తాజాగా జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. నిన్నటిరోజున ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కుంద్రా మాట్లాడుతూ బెట్టింగ్ వ్యవహారంలో సుప్రీం పరిధిలో సరిగా పోరాడలేదని, అందుకు ఇంకా గిల్టీగా ఉందని వ్యాఖ్యానించాడు. తనని ఎలాంటి ఆధారాలు లేకుండానే దిల్లీ పోలీసులు అబాసు పాల్జేశారని వ్యథచెందారు. ఈ కేసులో తనని తాను నిరపరాధి అని నిరూపించుకునేందుకు ఆర్టీఐ చట్టం ఆధారంగా కుంద్రా పోరాటం సాగించారు. 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2015లో దీనిపై విచారణ చేపట్టిన ప్యానెల్ కుంద్రాని తప్పు పట్టింది. ఇప్పటికీ ఈ వివాదం తనలో గిల్టీని రగిలిస్తోందని కుంద్రా వాపోవడం విశేషం.