ప్రచురణ తేదీ : Sep 30, 2016 5:20 PM IST

మోడీని పొగిడిన రాహుల్.. ఏమనో తెలుసా..?

rahul-gandhi
రెండున్నరేళ్ల కాలం లో నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానిలా వ్యవహరించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. భారత సైన్యం గురువారం పాక్ ఉగ్రవాద స్థావరాల పై చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో రాహుల్ మోడీని అభినందించారు.తనకు తొలిసారి మోడీతో మాట్లాడాలని ఉందని అన్నారు దానికి గల కారణం మోడీ ప్రధానిలా వ్యవహరించడమే అని అన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోడీ తీసుకున్న చర్యలకు తాము పూర్తిగా మద్దత్తు ఇస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నేకాక దేశమంతా మోడీ కి ఈ విషయం లో అండగా నిలుస్తుందని అన్నారు.ప్రభుత్వం తీసుకున్న సర్జికల్ స్ట్రైక్స్ నిర్ణయాన్ని సైనికులు విజయవంతంగా పూర్తి చేయడం పై సోనియాగాంధీ ఆర్మీని అభినందించారు.

Comments