ప్రచురణ తేదీ : Dec 30, 2016 5:28 PM IST

మోడీకి ఐదు ప్రశ్నలను సంధించిన రాహుల్ గాంధీ

rahul-gandhi
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై ఎప్పుడు ఛాన్స్ దొరికినా విమర్శల వర్షం కురిపిస్తారు. నవంబర్ 8న మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటి నుండి రాహుల్ గాంధీ మరింత తీవ్రంగా మోడీపై విరుచుకు పడుతున్నారు. ఈ విమర్శలకు బీజేపీ నేతలు, ప్రధాని రాహుల్ పై ప్రతి విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాహుల్ పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారో చెప్పాలని ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మోడీని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ, ప్రభుత్వం ఏం సాధించాయని, తాను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.

1) నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత ఎంత మేరకు నల్లధనం బయటపడింది..?
2) భారత్ ఈ నిర్ణయం వాళ్ళ ఆర్ధికంగా ఎంత నష్టపోయింది..? ప్రజలు ఆదాయం ఎంత కోల్పోయారు..?
3) పెద్దనోట్ల రద్దు తో ఎంతమంది చనిపోయారు..?వాళ్లకు నష్టపరిహారం ఇచ్చారా..? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు..?
4) పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నపుడు మోడీ ఎవరిని సంప్రదించారు..?
5) పెద్దనోట్ల రద్దు కు రెండు నెలల ముందు నుండి బ్యాంకులలో ఎవరైనా 25 లక్షలు కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు చెప్పండి..?

Comments