ప్రచురణ తేదీ : Jan 21, 2017 1:16 PM IST

కళ్ళు తిరిగి పడిపోయిన హీరో లారెన్స్

Raghava-lawrence
ప్రముఖ హీరో, నటుడు , డైరెక్టర్ , డాన్సర్ లారెన్స్ ఇప్పుడు తమిళ యువత హృదయాలలో గొప్పగా నిలుస్తున్నాడు. జల్లి కట్టు కోసం చిత్త శుద్ధి తో సంఘీభావం తెలిపిన మొదటి సినిమా ప్రముఖుడు లారెన్స్ మాత్రమే. మెరీనా బీచ్ కు వెళ్లి జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న వారితో జతకలిశాడు లారెన్స్. అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ తన గళం వినిపించాడు. ఈ క్రమంలో అతను పూర్తిగా అలసిపోయాడు. నిన్న ఉదయం విద్యార్థులతో పాటు కూర్చున్న లారెన్స్ 11.30 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడున్న యువత ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికి లారెన్స్ కోలుకున్నాడు.జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి ఆహారపానీయాలకు కోటి రూపాయలైనా ఖర్చు చేస్తానని లారెన్స్ ప్రకటించడం… తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు, పోరాటంలో పాల్గొన్న మహిళల అవసరాల కోసం టాయ్ లెట్ సదుపాయం ఉన్న ఐదు కేరవాన్ లను మెరీనా తీరంలో ఏర్పాటు చేశాడు. లారెన్స్ చేసిన సహాయం అక్కడి యువతకు ఆయనను పెద్దన్నను చేసింది.

Comments