ప్రచురణ తేదీ : Fri, Sep 16th, 2016

ఆయనే సీఎం కావాలని నయీమ్ కోరుకున్నాడట..!

r-krishnaiah
ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు నయీమ్ తో సంబంధాలు ఉండేవని సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే అవి ఆర్థిక పరమైన లావాదేవీలు కావని అన్నారు.ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆర్ కృష్ణయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.నయీమ్ అరాచకాలకు పాల్పడ్డాడుకాబట్టి ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నట్లు తెలిపాడు.ప్రభుత్వం కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

తాను ముఖ్యమంత్రి పదవికోసం నయీమ్ ను కలిసినట్లుగా చెప్పడం సరికాదని అన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తనకు నోటీసులు ఇస్తే సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సిట్ దర్యాప్తులో పారదర్శకత లేదని ఈ కేసును సిబిఐ కి అప్పగిచాలని కోరారు. నయీమ్ చేసిన దురాగతాలు తనకు అంతగా తెలియవని అన్నారు.తాను సీఎం కావడం నయీమ్ కల అని అన్నారు. తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని నయీమ్ కోరుకునేవాడని అన్నారు.

Comments