ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

సునీల్ తో… డైమండ్ ఉంగరం అనుకుంటే! గిల్ట్ కూడా గిట్టుబాటు కాలే!


సునీల్ హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి 6 నెలలు పైగా అయ్యింది. మొదట్లో ఈ సినిమా మీద కాస్తా హైప్ భాగానే ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసున్న తర్వాత సినిమా ఎ కారణాల వలనో విడుదల జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదట్లో డైరెక్టర్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా భాగానే మార్కెట్ వచ్చింది. ఒవర్సీర్ లో ఈ సినిమాపై 35 లక్షలు ఇచ్చేందుకు అక్కడి డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చారు. అయితే రేటు నచ్చకపోవడం ప్రొడ్యుసర్ కొంత జాప్యం చేస్తూ వచ్చారు. అయిన ఓవర్సీస్ నుంచి సినిమాని ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడంతో మరల అదే డిస్టిబ్యూటర్స్ దగ్గరకి వెళ్తే మొదట్లో చెప్పిన మొత్తం అంటే ఇప్పుడు ఇవ్వడం కష్టం అని చెప్పాడని టాక్. దాంతో చివరికి 10 లక్షలు ఇస్తానని అదే డిస్టిబ్యూటర్స్ చెప్పడంతో మరల నిర్మాత కిరీటి వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై అసలు మార్కెట్ జరగకపోవడంతో ఓవర్సీస్ లో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని గౌతమి పుత్ర శాతకర్ణి నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డిని రంగంలోకి దించి అతని ద్వారా సినిమాని రిలీజ్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది.

అతను కూడా ప్రొడ్యుసర్ తో ఉన్న పరిచయం కొద్ది థియేటర్ రెంట్లు చెల్లించుకొని సినిమా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆ ప్రొడ్యుసర్ దిగాలుగా తల మీద చెయ్యి వేసుకొని సినిమా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మొదట్లోనే మార్కెట్ ఉన్నప్పుడు అమ్మేసుకుంటే 35 లక్షలు వచ్చేదని ఇప్పుడు పైసా కూడా రాలేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. మొత్తానికి ప్రొడ్యుసర్ అలా ఉంగరాల రాంబాబుతో సునీల్ ని నమ్ముకొని డైమండ్ ఉంగరం కొనుక్కోవాలని ఆశపడితే ఇప్పుడు అతనికి కనీసం గిల్ట్ ఉంగరం కొనుక్కొనే అవకాశం లేకుండా పోయిందని ఇండస్ట్రీలో అందరు అనుకుంటున్నారు.

Comments