ప్రచురణ తేదీ : Dec 7, 2017 10:12 PM IST

ఆసియాలోనే మోస్ట్ సెక్సీయెస్ట్ లేడీ ఎవ‌రో తెలుసా?

ఆసియా ఖండంలోనే టాప్‌-1 సెక్సీయెస్ట్ గాళ్ ఎవ‌రో తెలుసా? బాలీవుడ్‌, హాలీవుడ్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌దైన హ‌వా సాగిస్తున్న ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ. గ‌తేడాది ఆ స్థానంలో ఉన్న దీపిక ప‌దుకొన్‌ని కిందికి తోసి, తాను ఈ స్థానాన్ని ద‌క్కించుకుంది. అంతేకాదు మోస్ట్ సెక్సీయెస్ట్ విమెన్స్ జాబితాలో దీపిక‌ను వెన‌క్కు నెట్టి రెండో స్థానంలోకి చేరింది టీవీ న‌టి నియా శ‌ర్మ‌. దీపిక ప్ర‌స్తుతం మూడో స్థానంలో సెటిలైంది. లండ‌న్‌కి చెందిన ప్ర‌ఖ్యాత `ఈస్టర్న్ ఐ` వీక్లీ స‌ర్వే ఈ ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించింది.

త‌న‌ని నంబ‌ర్ -1ని చేసిన ఓట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన పీసీ .. చూసేవారి దృష్టికోణాన్ని బ‌ట్టి త‌న‌కు ఈ గుర్తింపు ద‌క్కింద‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. టాప్ -50 జాబితాలో.. 4వ స్థానంలో ఆలియాభ‌ట్‌, 5వ స్థానంలో పాకిస్థాన్ నటి మహీరా ఖాన్, 6వ స్థానంలో ద్రష్టి ధామి, 7వ స్థానంలో కత్రినా, 8వ స్థానంలో శ్రద్ధా కపూర్, 9వ స్థానంలో గౌహర్ ఖాన్, 10వ స్థానంలో రుబీనా దిలైక్ నిలిచారు. `యే రిష్టా క్యా కెహల్తా హై` సీరియల్‌తో పాపుల‌రైన‌ 19 ఏళ్ల శివంగి జోషికి 16వ స్థానం దక్కింది. ఇక ఈ జాబితాలో 54 ఏళ్ల శ్రీ‌దేవికి 49వ స్థానం ద‌క్క‌డం షాక్‌నిచ్చే వ్య‌వ‌హార‌మే. ఈ వ‌య‌సులోనూ అతిలోక సుంద‌రి హ‌వా త‌గ్గ‌లేద‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌.

Comments