ప్రచురణ తేదీ : Jan 11, 2018 8:53 PM IST

తిరుమలలో తప్పు చేసిన మోడీ సోదరుడు..!

నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ బుధవారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. కాగా ఆయన చేసిన అపచారం వివాదంగా మారింది. తిరుమలలో గోవిందా సాయి అతిథి గృహానికి చేరుకున్న ప్రహ్లాద్ మోడీకి టిడిడి అధికారులు స్వాగతం పలికారు. ఈ సంద్భర్భంగా ఆయనకు వసతి ఏర్పాట్లు చేసారు.

గురువారం ఆయన విఐపి బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రహ్లాద్ మోడీ వచ్చిన కారు, ఆయన అనుచరులు ప్రయాణించిన వాహనాలకు బిజెపి జెండాలు కనిపించాయి. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలకు, అటువంటి ఛాయలు, ప్రచారాలకు తావు లేదు. దీనిని వివాదం రేగింది. ప్రహ్లాద్ మోడీ ప్రయాణించే ముందుగా ఆయన ఈ విషయం టిటిడి అధికారులు చెప్పలేదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల ఏర్పాట్ల విషయంలో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొనే టిటిడి, తాజాగా ఈ వివాదంలో చిక్కుకుంది.

Comments