ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

ప్ర‌భాస్ ఏకంగా 20 కేజీల బ‌రువు త‌గ్గాల‌ట‌

prabhas
బాహుబ‌లి పార్ట్ 1, పార్ట్ 2లో న‌టించేందుకు ప్ర‌భాస్ భారీగా బ‌రువు పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆహార‌నియ‌మాలు పాటిస్తూ తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేశాడు. అందుకు త‌గ్గ‌ట్టే సుశిక్షితులైన ట్రైన‌ర్స్ వ‌ద్ద శిక్ష‌ణ పొందాడు. భారీగా దేహాకృతిని మ‌లుచుకున్నాడు. దీనివ‌ల్ల భారీకాయుడిగా క‌నిపిస్తున్నాడు. అయితే ఇలానే క‌నిపిస్తే త‌దుప‌రి సినిమాకి కుద‌ర‌ద‌ని చెప్పేశాడుట సుజిత్‌. అందుకే ఇప్పుడు బ‌రువు తగ్గే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

ప్ర‌భాస్ ఇప్పుడు మ‌ళ్లీ స్లిమ్ అయ్యే ప‌నిలో ఉన్నాడు. దాదాపు 20 కేజీల బ‌రువు త‌గ్గించాల‌ని క‌స‌ర‌త్తులు చేస్తున్నాడుట‌. త్వ‌ర‌లోనే ఈ కొత్త సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళుతుంద‌ని తెలుస్తోంది.

Comments