ప్రచురణ తేదీ : Thu, Sep 28th, 2017

అమరావతికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్ ఛాంపియన్ షిప్ రూపంలో..!!

తొలిసారి ఆంధ్రుల రాజధాని అమరావతికి ప్రపంచాన్ని ఆకర్షించే తొలి అవకాశం దక్కింది. ఎపి ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చి దిద్దాలని భావిస్తున్న విషయం తెలిసిందే. కాగా పవర్ బోటింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు ఆతిధ్యమిచ్చే అవకాశం అమరావతికి దక్కింది. వచ్చే ఏడాది 10 రోజులపాటు అమరావతి కృష్ణా తీరంలో ఈ పోటీలు జరగనున్నాయి.

ఈ విషయంపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులతా పాల్గొనబోతుండడంతో ఈ పోటీలని విజయవంతం చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. పోటీలు జరిగినన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఫుడ్ ఫెస్టివ్స్ జరిగేలా ఆర్గనైజర్లని ఆహ్వానించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. బోటింగ్ కూడా ఓ ఆసక్తికరమైన క్రీడే కాడంతో అమరావతిని ప్రపంచం మొత్తం చూసే అవకాశం ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ రూపంలో దక్కింది.

Comments