ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

చాందిని అలా చేయడం ఇష్టం లేకనే హత్య..!

హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసులో అన్ని నిజాలని పోలీస్ లు ఛేదించారు. ఓ ప్రణాళిక ప్రకారమే చాందినిని సాయి కిరణ్ హతమార్చాడని సైబరాబాద్ సిపి సందీప్ తెలిపారు. ఈ ఘటన పై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.సాయికిరణ్ రెండు నెలల క్రితమే హత్య జరిగిన అడ్డగుట్ట ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వచ్చినట్లు తమ విచారణ లో తేలిందని సందీప్ తెలిపారు. చాందినికి స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. మరొకరితో చాందిని సన్నిహితంగా మెలగడం ఇష్టం లేకనే సాయి కిరణ్ చాందినిని హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు జరిగిన గెట్ టూ గెదర్ లో చాందిని మరొకరితో సన్నిహితంగా మెలగడం సాయికిరణ్ గమనించాడు. 9 వ తేదీ సోహైల్ అనే వ్యక్తి తో పబ్ కు వెళ్లాలని చాందిని అనుకుంది. కానీ అదే సమయం సాయి కిరణ్ పిలవడంతో పబ్ కు రానని సోహైల్ కు తెలిపింది. తనతో పాటు మరో ఇద్దరితో చాందిని చనువుగా ఉండడం సాయికిరణ్ జీర్ణించుకోలేక పోయాడు. అదే సమయం తనని పెళ్లి చేసుకోవాలని చాందిని సాయికిరణ్ పై ఒత్తిడి తీసుకుని రావడం అతడికి నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సాయికిరణ్ సహనం కోల్పోయాడు. చాందినిని మెడ పై కొట్టి, చున్నీని ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమెని గుట్ట పై నుంచి కిందకు తోసేశాడు అని పోలీస్ లు వివరించారు.

Comments