ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

మోడీ అందరూ అనుకుంటున్నట్టు ముస్లిం వ్యతిరేకి కాదు అంటున్న నజీబ్ జంగ్

nazeeb-jung
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే ముస్లిం లకు కష్టాలు తప్పవని, వాళ్లకు అవకాశాలు రావనీ అందరూ అనుకున్నారు, కానీ మోడీ ప్రధాని అయ్యాక అటువంటివి ఏమి జరగకపోగా ముస్లింలతో సన్నిహిత సంబంధాలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్థాన్ తో కూడా ఆయన అధికారంలోకి రాగానే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నారు. కానీ ఆ దేశం అందుకు సిద్ధంగా లేకపోవడంతో మోడీ ఆ దేశంపై ఆగ్రహించారు. కానీ దేశంలో ఉన్న ముస్లింలను మాత్రం చాలా బాగా చూసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీల పట్ల మోడీ పక్షపాతం చూపిస్తారని కొన్ని రాజకీయ పార్టీలు చేసే ఆరోపణలు అబద్దమని ఆయన అన్నారు. తాను ప్రధాని మోడీతో సుదీర్ఘంగా చర్చించానని, ముస్లింలతో సంబంధాలతో మోడీ ఎలాంటి వివక్ష చూపలేదని ఆయన అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలు అందరూ ఆలోచించి ఈ పద్దతికి స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ లో 20 శాతం మంది ముస్లింలు ఉన్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కారణంగా నజీబ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments