ప్రచురణ తేదీ : Tue, Dec 27th, 2016

మోడీ దెబ్బకి పీఠాలు కదులుతున్నాయి :

narendra-modi
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న మోడీ పుణ్యం ఏమో కానీ పెద్ద పెద్ద చేపలు అన్నీ ఇప్పుడు గేలానికి చిక్కేస్తున్నాయి. ఇంతకాలం గుట్టుగా నడిచిన వ్యవహారాలు అన్నీ నెమ్మది నెమ్మదిగా బయట పడుతున్నాయి. తెరచాటు న నడిచిన భాగోతాలు ఒక్కొక్కటీ షాక్ పుట్టిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేయడం తో వివిధ రూపాల్లో తమ తమ బ్లాక్ మనీ మొత్తాన్నీ బయటకి తీసే క్రమం లో ఒక్కొక్కరూ అడ్డంగా దొరికిపోతున్నారు. రేపో ఎల్లుండో ఉత్తర ప్రదేశ్ అసంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది అన్న అంచనాల వేళ యూపీ ఎన్నికల్లో బీ ఎస్పీ కి ఒక షాకింగ్ దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత్రి మాయావతికి దిమ్మ తిరిగిపోయేలాంటి విషయాన్ని ఈడీ గుర్తించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆ పార్టీ బ్యాంకు ఖాతాలోకి రూ.104కోట్ల నగదు జమ అయినట్లుగా ఈడీ వర్గాలు గుర్తించాయి.అంతేకాదు.. మాయావతి సోదరుడు ఆనంద్ ఖాతాలో రూ.1.43 కోట్లు వేసినట్లుగా తేలింది. భారీ మొత్తాల్ని బ్యాంకుఖాతాల్లో వేసిన లావాదేవీల్ని యథాలాపంగా పరిశీలిస్తున్న వేళ.. ఈ వ్యవహారం బయటకు వచ్చింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరోల్ బాగ్ బ్రాంచ్ లో రెండు ఆసక్తికర అంశాల్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ ఖాతాలో రూ.102కోట్లు జమ కావటం.. అవన్నీ రద్దు అయిన పాత వెయ్యి నోట్లు కావటం గమనార్హం. రోజు తర్వాత రోజు చొప్పున భారీ మొత్తాన్ని జమ చేసిన విషయాన్ని గుర్తించారు. రోజు తర్వాత రోజు రూ.15 నుంచి రూ.17 కోట్ల చొప్పున నగదును జమ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్రాంచ్ సీసీ కెమేరాల పుటేజ్ తో పాటు.. నగదు జమ చేసిన వారికి సంబంధించిన కేవైసీ పత్రాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఎన్నికల వేళ.. ఇలాంటి ఉదంతం బయటకు రావటం మాయావతికి ఇబ్బందేనన్న భావన వ్యక్తమవుతోంది.

Comments