ప్రచురణ తేదీ : Thu, Sep 14th, 2017

అమెరికాలో పవన్ కళ్యాణ్ బొమ్మడిపోయింది!


పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూడో చిత్రానికి అమాంతం అంచనాలు పెరిగిపోతున్నాయి. వీళ్లిద్దరి కాంబోలు గతంలో వచ్చిన రెండు చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది ఘనవిజయం సాధించాయి. దీనితో ఈ సినిమా కూడా మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం పవన్ అభిమానుల్లో ఉంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఎంచుకున్న తారాగణం కూడా భారీగానే ఉంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఖుష్బూ, బోమన్ ఇరానీ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ లో సంచలనాలు మొదలు పెట్టేసింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాం హక్కులని రూ 29 కోట్లు వెచ్చించి కొనుక్కున్నారు. ఏ వార్త సంచలనంగా మారి హల్ చల్ చేస్తుంటే.. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు షాక్ ఇచ్చేలా ఉన్నాయ్. పవన్ సినిమా ఓవర్సీస్ హక్కుల్ని బ్లూ స్కై సంస్థ 21 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ రెండు ఏరియాలలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 50 కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ చిత్రం మునుముందు ఇంకెన్ని సంచలనాలు సృస్టించనుందో చూడాలి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సాంగ్ బిట్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Comments