ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

శాతకర్ణి.. ఇది ఖచ్చితంగా పక్షపాతమే..!!

gouthamiputhra
బాలయ్య వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభించినప్పటినుంచి ఈ చిత్రం పై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఆంధ్రుల చరిత్రని తెరకెక్కిస్తున్నారని దర్శకుడు క్రిష్ పై పలువురు ప్రశంసల జల్లులు కురిపించారు. కాగా ఈచిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రంపై విమర్శలకు కారణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే. ఈ చిత్రం పై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రానికి వినోదపు పన్నుని తొలగించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై కనీస అవగాహన లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ వినోదాపుపన్ను మినహాయింపుని కల్పించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా పక్షపాత చర్య అని ఆరోపించారు.

మొదట తెలంగాణా ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆతరువాత ఎపి ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి వినోదాపుపన్ను మినహాయించింది.చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథతో కూడిన చిత్రం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కాగా చిత్రం అవుట్ ఫుట్ పై కనీస అవగాహనా లేకుండా వినోదపు పన్ను ఎలా మినహాయింపు కల్పిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రుద్రమదేవి చిత్రం చారిత్రాత్మక నేపథ్యంతో వచ్చినా ఆ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఏపీ ప్రభుత్వం కల్పించలేదన్న వాదన వినిపిస్తోంది.

Comments