ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

ఆ పార్టీ ని ఓఎల్ఎక్స్ లో పెడతారా..?

payyavula
వైఎస్ జగన్ పై టిడిపి నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. టిడిపి నేతలు వరుసగా జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.తాజాగా టిడిపి నేత పయ్యావుల కేశవ్ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి, అవినీతి రెండూ అవిభక్త కవలలని ఆరోపించారు.జగన్ త్వరలో జైలుకు వెళ్లక తప్పదని, ఆతరువాత ఆయన పార్టీని ఓ ఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టాల్సిందే అని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ నల్ల ధన మూలాలను కూడా వెల్లడించాలని డిమాండ్ చేసారు.దేశంలోనే అతిపెద్ద నల్ల ధన సామ్రాట్ జగన్ అని అన్నారు. జగన్ కంపెనీలలో అన్ని పెట్టుబడులు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని కేశవ్ అన్నారు. జగన్ ని దర్యాప్తు సంస్థ ఈడీ వదిలిపెట్డదని, ఆయన జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

Comments