ప్రచురణ తేదీ : Mon, Mar 20th, 2017

ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ బ‌న్ని ఫ్యాన్స్‌! వార్‌ కంటిన్యూ!!


నువ్వెంత? అంటే నువ్వెంత‌? .. ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మ‌ధ్య సాగుతున్న హోరాహోరీ ఇది. చెప్ప‌ను బ్ర‌ద‌ర్! అన్న పాపానికి బ‌న్నీని షంటేస్తున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. మావోడిని ఇలా చేస్తార్రా? అంటూ బ‌న్ని ఫ్యాన్స్ సైతం వార్‌లోకి దిగిపోయి ప‌వ‌న్‌ని కూడా షంటేయ‌డం స్టార్ట్ చేశారు. అదెలాగంటారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఇటీవ‌లి కాలంలో మెగా ఫ్యాన్స్ వ‌ర్సెస్ మెగా ఫ్యాన్స్‌! అన్న టాపిక్ టాలీవుడ్‌ని మెతెక్కించేస్తోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి, బ‌న్ని ఫ్యాన్స్‌కి మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. అది ఆన్‌లైన్ యుద్ధం. ఒక‌రి టీజ‌ర్‌కి ఒక‌రు డిజ్‌లైక్స్ కొడుతూ ర‌చ్చ ర‌చ్చ చేసేస్తున్నారు. ఇదివ‌ర‌కే బ‌న్ని న‌టించిన డీజే-దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ టీజ‌ర్ లాంచ్ అయ్యాక‌.. సామాజిక మాధ్య‌మాల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ డిజ్‌లైక్స్ కొట్టి హోరెత్తించారు. డీజేకి 1ల‌క్షా 60వేల డిజ్‌లైక్స్ ప‌డ్డాయి ఇప్ప‌టికి. అయితే బ‌న్ని ఫ్యాన్స్ ఊరుకుంటారా? మాక్కూడా ఛాన్స్ వ‌స్తుంది. అప్పుడు మా త‌డాఖా చూపిస్తాం! అనుకున్నారు. తాజాగా ప‌వ‌న్ `కాట‌మ‌రాయుడు` ట్రైల‌ర్ రిలీజైంది క‌దా! ఇప్పుడు బ‌న్ని ఫ్యాన్స్ క‌క్ష తీర్చుకుంటున్నారు. ఈ ట్రైల‌ర్‌కి ఇప్ప‌టికే 42 వేల డిజ్‌లైక్స్ కొట్టారు. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గాలంటే మామ‌- అల్లుల్లు ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌లుసుకుని భుజం భుజం రాసుకుని ఫ్యాన్స్‌ని కూల్‌ చేస్తే స‌రిపోతుంది క‌దా! అంటుకున్నారు కొంద‌రు.

Comments