ప్రచురణ తేదీ : Jan 31, 2018 4:34 PM IST

టిడిపి ని పవన్ ప్రశ్నించాలంటున్నకత్తి మహేష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ విశ్లేషకులు కత్తి మహేష్ కు మధ్య జరిగిన వివాదం చివరకు సయోధ్య తో సమసిపోయి పవన్ అభిమానులతో కలిసి పార్టీ కూడా చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అప్పటినుండి చాలా వరకు సైలెంట్గా ఉంటున్న కత్తి మహేష్ అప్పుడప్పుడు మాత్రం పవన్ కు తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రశ్నల పై పవన్ నోరువిప్పనప్పటికీ ఆయన మాత్రం ఈ ప్రశ్నల వర్షాన్ని కొనసాగిస్తూనే వున్నారు. అయితే దీనిలో భాగంగా ఆయన ఇవాళ పవన్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. టిడిపి ని పవన్ ప్రశ్నించకపోవడం తప్పు పడుతున్నట్లుగా ఈ ట్వీట్ లో వుంది. ‘టీడీపీ ప్రభుత్వ అవినీతి పై ఆధారాలున్నాయన్నా ప్రశ్నించను అని మొండికేస్తే యెట్లాగబ్బా? న్యూట్రల్ గా ఉంటే న్యూట్రల్ గా ఉండాలి, మిత్ర పక్షం అయితే స్నేహ ధర్మం పాటించాలి. అలా అటూ ఇటూ కాకపోతే సమర్ధత, ధైర్యం పైన అనవసరపు సందేహాలొస్తాయి అని ట్వీట్ చేసారు….

Comments