ప్రచురణ తేదీ : Jan 26, 2017 3:36 PM IST

‘పందుల పందేలు’ ఆదుకోండి..గుర్తుంచుకుంటానన్న జనసేనాని..!

pawan
ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న వేళ కేంద్ర మంత్రి సుజనాచౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు జత చేసారు. ఏపీ యువత మొత్తం ప్రత్యేక హోదా నిరసనలతో పాల్గొంటున్న సమయంలో సుజనాచౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే అదే ఆడుకోవాలని సుజనాచౌదరి ఎద్దేవా చేశారు. లేకపోతె కోళ్ల పందేలు, పందుల పందేలు ఆదుకోవాలని ప్రత్యేక హోదా ఉద్యమం పై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆందోళనలు నిరసనల తో హోరెత్తుతున్న ఏపీ లో సుజనా చౌదరి వ్యాఖ్యలు మరింత వేడిని పెంచేలా కనిపిస్తున్నాయి. వైసిపి నాయకులూ సృజన చౌదరి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుజనా చౌదరి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.సుజనాచౌదరి లాంటి వ్యక్తి అలంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసే కొద్దీ యువతిని రెచ్చగొట్టడమే అని పవన్ అన్నారు. ఆంధ్రలోని యువత మొత్తం ఇలా అవహేళన చేసి మాట్లాడే ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకులందరినీ గుర్తుంచుకుంటారని అన్నారు.ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే మీ ఇస్తామని పవన్ అన్నారు. పోలీస్ లు అదుపులోకి తీసుకున్న ప్రతిఒక్క జనసేన కార్యకర్తని, యువతిని వెంటనే భేషరుతు గా విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

Comments