ప్రచురణ తేదీ : Wed, Jan 25th, 2017

సినిమా షూటింగ్ లోంచి డబ్భై ట్వీట్ లు వేసిన పవన్ కళ్యాణ్

pawan-kalyan
ప్రత్యేక హోదా మీద యువత పోరాటం అంటూ ప్రకటించ గానే చాలా మంది సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు వారిలో హీరో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. ట్విట్టర్ వేదిక గా మాట్లాడిన పవన్ తన మనసులో మాటలు అన్నీ అక్కడ బయట పెట్టాడు. జనవరి 26 న వైజాగ్ ఆర్కే బీచ్ లో జరిగే మౌన దీక్ష మీద ఆయన చేస్తున్న ట్వీట్ ల జోరు ఒక రేంజ్ లో ఉంది. నిన్నా మొన్నా ఇవాళ కలిపి ఈ ప్రోగ్రాం కోసం పవన్ అక్షరాలా డబ్భై ట్వీట్ లు వేసాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. పవన్ నుంచి వస్తున్న ట్వీట్లతో.. జనవరి 26న ఆర్కే బీచ్ దగ్గరి నిరసన దీక్షపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మరి.. అంతలా హీట్ జనరేట్ చేస్తున్న పవర్ స్టార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న ఆరా తీస్తే షాక్ తినాల్సిందే. ఓపక్క తన ట్వీట్స్ తో ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించి.. అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆయన.. తాను మాత్రం కాటమరాయుడి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండటం విశేషం.

Comments