ప్రచురణ తేదీ : Sat, Apr 21st, 2018

పవన్‌ కు శ్రీనిరాజు లీగల్‌ నోటీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై కుట్ర జరుగుతోందని ట్విట్టర్ వేదికగా కొన్ని మీడియా ఛానెల్స్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుల అండదండలతోనే మీడియా తనపై కుట్ర పన్నుతోందని ఆ తరహాలోనే తన తల్లిని అవమానించే విధంగా చేశారని పవన్ తెలిపిన విధానం రాష్ట్ర మీడియాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ప్రముఖ మీడియా సిఈఓ శ్రీని రాజుపై పవన్ చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారింది.

శ్రీని రాజు తన తరపు న్యాయవాది నుంచి పవన్ కళ్యాణ్ కు నోటీసులు పంపారు. పవన్ అనవసరమైన మరియు నిజంలేని వ్యాఖ్యలు చేయడంతో శ్రీని రాజు షాక్ అయినట్లు లాయర్ నోటిస్ ద్వారా తెలిపారు. అంతే కాకుండా శ్రీని రాజుకు రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ.. రవి ప్రకాష్ – వర్మ తో చేతులు కలిపి శ్రీని రాజు తన తల్లిపై అనుచిత ఆరోపణలు చేయించాడని పవన్ చెప్పడం కేవలం ఉహాజనితామని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేస్తే సాధారణ రాజకీయ నాయకులకు పవన్ కు తేడా ఏమిటని, ఆరోపణల ద్వారా పవన్ ఎంత బాదపడ్డారో ఇప్పుడు పవన్ కామెంట్స్ కు తన క్లయింట్‌ కూడా అదే స్థాయిలో బాధపడ్డారని నోటిస్ ద్వారా తెలియజేశారు.

Comments