ప్రచురణ తేదీ : Jan 12, 2018 1:33 PM IST

రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయనున్న పవన్ కళ్యాణ్..?

అజ్ఞాతవాసి చిత్ర నష్టాల తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో తెలియదు కానీ.. బయ్యర్లు అంతా నష్టపోవడం ఖాయం అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ కు త్రివిక్రమ్ డైరెక్షన్ బ్రాండ్ తోడు కావడంతో ఈ చిత్రాన్ని బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా అజ్ఞాతవాసికి తొలిషో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ రెండవ రోజు నుంచి ఈ చిత్ర వసూళ్లు పూర్తిగా తగ్గుముఖం పట్టేశాయి. భారీ నష్టాల బాట పడుతుండడంతో బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు.

కాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడానికి సిద్దపడ్డట్లు తెలుస్తోంది. మరొకొన్ని రోజులు నష్టాలని అంచనా వేశాక తన రెమ్యూనరేషన్లో కొంతమొత్తం తిరిగి ఇచ్చేయడానికి పవన్ సమాయత్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ ని వదులుకున్న సంద్భర్భాలు ఉన్నాయి.

Comments