ప్రచురణ తేదీ : Jan 12, 2018 1:40 PM IST

ఆయన అజ్ఞాతవాసి, నేను బహిరంగవాసి : వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అంశం విషయం లో వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లతో తన అభిప్రాయాన్ని తెల్పుతుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల విషయం లో కూడా ఏదో ఒక ట్వీట్ చేస్తుంటారు. మొన్న విడుదలైన అజ్ఞాతవాసి విషయంలో కూడా గోళ్ళు, పళ్ళు లేని పులిని నేను ఇంతవరకు చూడలేదని, పవన్ నటించిన పులి చిత్రం కంటే ఇది అత్యంత చెత్త సినిమా అని, మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ పులి దూకాల్సింది పోయి పాకుతోందని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే తాజాకా రాంగోపాల్ వర్మ అజ్ఞాతవాసి లోని ఒక పోస్టర్ ని తానే మార్ఫింగ్ చేసి పవన్ ఫోటో బదులు తన ఫోటో పెట్టి , దానికి టైటల్ ‘బహిరంగవాసి’ అని నామకరణం చేశారు. ఈ ఫోటో నెట్లో పెట్టిన కాసేపటికే లక్షల్లో లైకులు సంపాదించింది. వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఒక చిత్రం, అలాగే లక్ష్మి స్ యన్టీఆర్ , కడప అనే ఒక తెలుగు వెబ్ సిరీస్ , పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో మరొక చిత్రం తెరకెక్కిస్తున్నారు.

Comments