ప్రచురణ తేదీ : Mar 27, 2018 6:27 PM IST

పవన్ కళ్యాణ్ “తోట రాముడు” : నాగబాబు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఇష్టమని, సినిమాల్లోకి రాకపోతే రైతును అయ్యేవాడినని పలు సందర్భాల్లో చెప్పారు. రైతుగా ఉండడమంటే తనకు ఎంతో ఇష్టమని తరచుగా చెప్పే పవన్ కు తోటరాముడు అనే ముద్దుపేరు వున్న విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ, ఆయనకు ఆ ముద్దు పేరు పెట్టిందెవరో కాదు, ఆయన సోదరుడు నాగబాబే. పవన్ సినిమాల మధ్య గ్యాప్ సమయంలో తన ఫామ్ హౌస్ లో పొలం పని చేస్తూ ఉండటం, అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడం అక్కడక్కడ చూసాము.

అయితే ఆ విధంగా పవన్ పోలంపనులు చేయడం చూసిన నాగబాబు, ఆయనకు ముద్దుగా ‘తోటరాముడు’ అని పేరు పెట్టారట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే ఓ సందర్భంలో చెప్పారు. సాధారణంగా ఏ హీరో అయినా తాను చేసే సినిమాలకు మధ్య గ్యాప్ లభించినప్పుడు తన తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చదువుకోవడం, అలానే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి చేయాలి ఎలా చేయాలి, ప్రస్తుతం మూవీ ట్రెండ్ ఎలా వుంది అనే విషయాలపై దృష్టిపెడుతుంటారని, కానీ పవన్ మాత్రం అలా కాకుండా తోటపని, వ్యవసాయం చేస్తుంటారని, అందుకే, అది చూసి సరదాగా ‘తోటరాముడు’ అని ముద్దు పేరుపెట్టానని నాగబాబు సరదాగా చెప్పుకొచ్చారు….

Comments