ప్రచురణ తేదీ : Sat, Nov 4th, 2017

పవన్ 25వ చిత్రం ఫొటోస్ లీక్..

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సినిమాకు సమబందించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. షూటింగ్ జరుగుతుండగా ఎవరో చాటుగా తీసినట్లు ఉన్న ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకుముందే ఒకసారి ఈ విధంగా పవన్ ఫొటోస్ లీక్ అయ్యాయి. అయితే ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ అండ్ పవన్ కళ్యాణ్ ఉన్న మరికొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. త్రివిక్రమ్ అను – పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫొటోస్ లో అను ఇమ్మాన్యుయేల్ కొంచెం గ్లామర్ గర్ల్ గా కనిపిస్తుండగా పవన్ కళ్యాణ్ స్టయిలిష్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఇక సినిమా ఫైనల్ షెడ్యూల్ అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనుంది. సినిమాలో కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Comments