ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

బికినిలో షాక్ ఇచ్చిన హీరోయిన్ సిస్టర్

వెన్నల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పార్వతి మెల్టన్. అయితే పార్వతి మొదట్లో అవకాశాలను బాగానే దక్కించుకున్న ఆ తర్వాత ఎక్కువగా స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. జల్సా సినిమాలో కనిపించిన పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మహేష్ దూకుడు సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసి అందరిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇక ఫైనల్ గా 2012 లో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది.

అయితే ఇప్పుడు ఆమె చిన్ని చెల్లెలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఆమె పేరు అరియానా సితార మెల్టన్. ఈ మధ్యనే కొన్ని ఫొటో షూట్స్ ని కూడా ఇచ్చింది. మొదటి ఫొటో చూట్ లోనే సితార మెల్టన్ బికినీలో ఇచ్చేసింది. బీచ్ లో దిగిన ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్వతి ఆ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చూస్తుంటే మొదటి సినిమాలోనే సితార రచ్చ చేసేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Comments