ప్రచురణ తేదీ : Sep 29, 2017 12:11 AM IST

పరిటాల సునీత బహిరంగ లేఖ

పరిటాల వారసుడు శ్రీరామ్, ఎవిఆర్ కంస్ట్రక్షన్స్ అధినేత కుమార్తె జ్ఞానవి ల వివాహం అక్టోబర్ 1 న జరగనుంది. ఇప్పటికే పరిటాల సునీత ప్రముఖులందరిని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. కాగా తాజాగా ఆమె తాజాగా అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు బహిరంగ ఆహ్వానాన్ని వెలువరించారు. మీ అన్న పరిటాల మరణం తరువాత మీ అభిమానమే బయటి ప్రపంచం తెలియని నన్ను నడిపించింది తెలిపారు.

మా ఇంట తోలి శుభకార్యం జరుగుతోందని ప్రతిఒక్కరూ శ్రీరామ్ పెళ్ళికి హాజరు కావాలని కోరారు. వివాహానికి ప్రతి ఒక్కరిని పేరు పేరునా పిలవాలని ఉందని, కానీ అలా చేయలేక పోతున్నందుకు భాదగా ఉందని సునీత అన్నారు. తనకున్న బాధ్యతల దృష్ట్యా అందరిని కలుసుకోలేకపోతున్నాని అన్నారు. మీ ఇంట కార్యంగా భావించి అంతా పెళ్ళికి హాజరు కావాలని కోరారు.

వివాహం విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నిలకల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పరిటాల వారసుడిగా శ్రీరామ్ అభిమానులకు చేరువగా ఉంటున్నారు.

Comments