ప్రచురణ తేదీ : Feb 9, 2017 10:53 AM IST

పన్నీర్ వేసిన కొత్త బాంబు , షాక్ లో శశికళ


అన్నాడీఎంకే vs పన్నీర్ సెల్వం అన్నట్టుగా పరిస్థితి సాగుతున్నా కూడా సెల్వం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాను ఎదురుకోగాలనా లేదా అనేది మాత్రం ఆలోచించకుండా శశికళ మీదకి తనదైన బాంబుల దాడి చేస్తూనే ఉన్నారు. మరొక్కసారి కొత్త బాంబు తో అందరినీ బెదర గొట్టేస్తున్నారు పన్నీర్ సెల్వం.ఇప్పటికే ఆమెకు కంటిమీద కునుకును దూరం చేసిన సెల్వం తాజాగా పార్టీ డబ్బులపై పూర్తి పెత్తనం తనదేనంటూ బాంబు పేల్చారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమమని, కాబట్టి తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాలోంచి డబ్బులు తీసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు లేఖలు రాశారు. అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం జయలలిత తనను కోశాధికారిగా నియమించారని, తన లిఖిత పూర్వక అనుమతి, సూచనలు లేకుండా పార్టీ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని కరూర్ వైశ్యాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లను ఆ లేఖల్లో కోరారు.

Comments