ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

భారత్ ను భయపెట్టాలనుకుని మరొకసారి ఫూల్ అయిన పాకిస్థాన్…!

pak
భారత్ ను ఏదో చేసేస్తాం, మా దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. భారత్ తో యుద్ధం చేయాల్సి వచ్చినా వెనుకాడే లేదంటూ పాకిస్థాన్ చూపించే మేకపోతు గాంభీర్యం ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు. భారత్ కన్నెర్ర చేస్తే పాకిస్థాన్ గతి ఏమవుతుందో ఇండియా చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్థాన్ కు అందరికంటే బాగా తెలుసు. కొన్ని రోజుల క్రితం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేసి దాదాపుగా 30 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతం చేశారు. అప్పుడు కూడా పాకిస్థాన్ మా దేశంలో ఎవరూ సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదనీ, అదంతా అబద్దమని వాదించింది. ప్రపంచ దేశాలేవి పాకిస్థాన్ ను నమ్మకపోవడం లాభం లేదనుకుని మౌనం వహించింది.

మళ్ళీ ఇప్పుడు ఇండియాను భయపెట్టాలనుకుని ప్రపంచం దృష్టిలో నవ్వుల పాలైంది. స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి నుండి ప్రయోగించగల అణ్వస్ర్తాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న బాబర్ – 3 క్షిపణిని సోమవారం విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించింది. 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా ఛేదిస్తుందని పాక్ పేర్కొంది. భారత్ లోని చాలా ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని గొప్పలు చెప్పుకుంది. భారత్ 2008లో జలాంతర్గామి నుండి ప్రయోగించగల అణ్వస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. 2013లో జలాంతర్గామి నుండి ప్రయోగించగల క్రూయిజ్ మిస్సైల్ ను కూడా విజయవంతంగా ప్రయోగించింది. దీంతో భయపడ్డ పాకిస్థాన్ తాము కూడా ఇలాంటి క్షిపణులను విజయవంతంగా ప్రయోగించామని గొప్పలు చెప్పుకుని ప్రపంచం దృష్టిలో మరొకసారి నవ్వులపాలైంది.

అయితే పాకిస్థాన్ చేసిన ప్రయోగం మొత్తం ఒక బూటకమని, పాక్ విడుదల చేసిన వీడియో కల్పితమని, దానిని అద్భుతంగా గ్రాఫిక్స్ చేశారని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఫోటోషాప్ ను ఉపయోగించిన విషయం స్పష్టంగా తెలుస్తుందని, పాకిస్తాన్ చెబుతున్న వేగానికి అది ప్రయాణించిన వేగానికి అసలు సంబంధం లేదని వారు చెప్తున్నారు. అలాగే మొదట్లో పసుపు రంగులో ఉన్న క్షిపణి మెల్లగా తెలుపు రంగులోకి మారిందని, ఇంకా చాలా లోపాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ బాబర్-3 క్షిపణి పరీక్ష అంతా ఒక నకిలీ ప్రయోగమని సోషల్ మీడియాలో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. మొత్తానికి మరొకసారి పాకిస్థాన్ ప్రపంచం దృష్టిలో నవ్వులపాలైంది.

Comments