ప్రచురణ తేదీ : Jan 12, 2018 2:37 PM IST

కత్తి మహేష్ కి కొన్ని జేఏసి సంఘాల మద్దతు

ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన ఫాన్స్ ఆగ్రహానికి గురైన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కి ఓయు జెఏసి మద్దతు లభించింది. పూనమ్ కౌర్, కోన వెంకట్, సంజన వంటి నటులు పవన్ కు మద్దతు తెలిపారు, దర్శకుడు వివేక్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో కత్తి మహేష్ తల్లి ప్రస్తావన తేవడం తో ఆ వివాదం మరింత ముదిరింది. ఈ విధంగా పవన్ కు మద్దతు లభిస్తే, నేడు కత్తి మహేష్ ను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం లో కలిసిన జె ఏ సి సంఘం వారు ఆయనకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించారు.

దీనిలో పలువు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ కత్తి మహేష్ కి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని, ఒక వేళ ఆయనకు ఏమైనా జరిగితే పవన్ ను తెలంగాణ లో ఎక్కడా తిరగనివ్వబోమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశము లో ముఖ్యంగా ‘పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో’ అంటూ జెఏసి సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలతోపాటు బహుజన సంఘాల నాయకులూ కూడా కత్తికి మద్దతుగా నిలవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Comments