ప్రచురణ తేదీ : Jan 12, 2018 6:05 PM IST

సూపర్ స్టార్ అభిమానులకు మళ్లీ నిరాశేనా?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో డి వి వి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డి వి వి దానయ్య నిర్మిస్తున్న నూతన చిత్రం భరత్ అనే నేను (వర్కింగ్ టైటిల్) చిత్రం ఫస్ట్ లుక్ పై అభిమానుల ఆశలకు మరొకసారి గండి పడినట్లే. అందుతున్న వార్తల ప్రకారం వారి ఆశ నిరాశగానే మిగిలేట్లుగా వుంది. ఇదివరకు నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఫస్ట్ లుక్ విడుదలవుతుందని వార్తలు షికారు చేశాయి, కానీ అది నిజం కాలేదు. అయితే అంతకుముందు ఈ చిత్ర తాలూకు స్టిల్ ఒకటి నెట్ లో లీక్ కాగా, తర్వాత మూవీ యూనిట్ అదే స్టిల్ ను అఫీషియల్ గా విడుదల చేసింది.

అసలు విషయానికి వస్తే మహేష్ బాబు కూడా చిత్రం ఔట్ ఫుట్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టినట్లు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా కొంత మెల్లగా అయినా సరే, మార్చి తర్వాతే మొదలుపెడమాని అన్నట్లు చెపుతున్నారు. ముందుగానే ఫస్ట్ లుక్ వంటివి రిలీజ్ చేస్తే దాని ప్రభావం సినిమా పైన హైప్ మరింత పెంచుతుందని, కాబట్టి కాస్తనంత లేట్ గానే మొదలపెట్టమని ఆయన అన్నట్లు సమాచారం. అసలే బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి చిత్రాల ఘోర పరాజయాల తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి మహేష్ పడుతున్న జాగ్రత్త మంచిదే అయినా కొంచెం అభిమానుల విషయంలో లో కూడా ఆలోచించి కనీసం టైటిల్ అనౌన్సమెంట్ అయినా చేస్తే బాగుంటుంది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం….

Comments