ప్రచురణ తేదీ : Dec 6, 2017 4:11 PM IST

తేజకు మళ్లీ బ్యాడ్ లక్కే..జవాన్ వేడి చల్లబడిపోయింది..!

సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా ఆ తరువాత రెగ్యులర్ షో లనుంచి టాక్ మారిపోయింది. కానీ కలెక్షన్ల విషయంలో గట్టెక్కుతుందనే అంచనాలు కూడా తలక్రిందులవుతున్నాయి. జవాన్ చిత్రానికి ప్రస్తుతం వస్తున్న వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. వీకెండ్ లో కాస్త పరవాలేదనిపించే విధందా ఈ చిత్రం రూ 6 కోట్ల షేర్ ని రాబట్టింది. కానీ సోమ, మంగళ వారాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం కలెక్షన్లు వస్తున్న ఫ్లో ప్రకారం 10 కోట్లకు మించి రావని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బయ్యర్లకు లాస్ తప్పదనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న తేజుకు జవాన్ మరో భారంగా మారనుంది. ఇప్పటికైనా సాయిధరమ్ తేజ్ సరైన కథలని ఎంపిక చేసుకోకుంటే ఆ ప్రభావం కెరీర్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు టేకప్ చేశారు.

Comments