ప్రచురణ తేదీ : Jan 25, 2017 11:59 PM IST

ఏపీ లో ఎక్కడికెళ్ళినా ఒకటే బంగారం ధర :

gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తక్కువగా ఉండే చోటు అంటే ప్రొద్దుటూరు అని చెప్పుకోవాలి. అక్కడ ఎప్పుడూ బంగారం ధర పది గ్రాములకి నాలుగొందలు వరకూ తేడా ఉంటుంది. ఇకపై అలా ఉండదు. రాష్ట్రంలోని అన్ని బంగారు దుకాణాల్లో ఒకే ధరకు బంగారం, వెండి విక్రయాలు సాగించాలని ఏపీ బులియన్ బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం నిర్ణయించింది. 13 జిల్లాల ఆభరణాల వర్తకుల మధ్య నెల్లూరులో ప్రత్యేక సమావేశం జరుగగా, సంఘంలో సభ్యత్వమున్న దుకాణదారులు హాజరయ్యారు. అన్ని దుకాణాల్లో ఒకే ధర అమలు చేయాలని నిర్ణయించినట్టు వర్తకుల సంఘం ప్రతినిధి శాంతిలాల్ జైన్ వెల్లడించారు.

Comments